యేసే నా ఆశ్రయము Song Lyrics | Yese Na Ashrayamu Song Lyrics - Worship Songs Lyrics
యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము
నా కోట నీవే ...
నా దుర్గము నీవే
నా కాపరి నీవే ( 2 )
శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊబిలో కూరుకున్ననూ ( 2 )
నన్ను లేవనెత్తును
నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును ( 2 ) || యేసే నా ||
జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా ( 2 )
నాకు తోడైయుండును
నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును ( 2 ) || యేసే నా ||
దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ ( 2 )
నాకు వెలుగిచ్చిను
నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును ( 2 ) || యేసే నా ||