శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం Song Lyrics |Sreshta Naamam Athi Sreshta Naamam Song Lyrics - Old christian Lyrics
శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం
శ్రీ యేసు నామము
త్రియేక దేవుని ప్రియమైన నామము
ప్రభు యేసు నామము
ఇమ్మానుయేలుగా ఇలకేతెంచిన
పరిశుద్ధ నామము
నా యేసు ఆశ్చర్యకరుడు
నా యేసు ఆలోచనకర్త
బలవంతుడు నిత్యుడు తండ్రి
సమాధాన కర్తని కీర్తింతుము
ఉన్నవాడవు అనువాడవు
యుగములన్నిట రాజువు
భూతవర్తమాన బవిష్యతులో
స్తుతులకు అర్హుడవు
ఇహ పరములో పైనామము
మహిమ ప్రభావము పొందెను
ప్రభు యేసు క్రీస్తు అనునామము
ప్రజలందరికి పూజ్యము