దైవమే తన చిత్తముగా Song Lyrics | పెళ్ళంటే దేహములు వేరైనా Song Lyrics | Pellante dehamulu Song Lyrics - Christian Marriage Song Lyrics
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా
ముడిపడే దృఢమైనదిగా
విడిపడే వీలులేనిదిగా
కలలకే సాకారముగా..
ఒకరికొకరు ఆధారముగా..
తల్లిస్థానంలో భార్యనుగా..
తండ్రిస్థానంలో భర్తనుగా..
నాదనే స్వార్థము విడగా..
మనదనే బంధముజతగా..
ప్రతిదినం తీగేలో లతగా..
అల్లుకపోయే చందముగా ఆ..ఆ...!
పెళ్లంటే దేహములు వేరైనా
ఒక్కటిగా ఫలియించే దైవ సంకల్పం
పెళ్ళంటే ఇరువూరు ఏకముగా
తండ్రీపని జరిగించే గొప్ప అవకాశం
ఇహలో..కాలలో... శూన్యం... ఉండగా
దైవం....తలచిన
బంధం....పెళ్ళిగా......మారెనుగా....!
""పెళ్ళంటే""
చరణం:1
రెండు కళ్ళు వేరు వేరు,
శిరమునందు వేరు కారు
దృశ్యమేది చూపిస్తున్న,చూపులు రెండు జతగా చేరు
రెండు కాళ్ళు వేరు వేరు
ఒక్క పదమునందు చేరు
అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు
ఇరువురోక్కటై ఏక దేహమై
దైవ కుటుంబం కావాలని తానే జతపరిచేనుగా
దేహసుఖముకే మనువు కోరక,
దేవతనయలనిపెంచాలని దైవం నీయమించేనుగా
ఆది బంధమే ఆలుమగలుగా
అన్ని బంధములను కలిపే మూలమై..!...మారెనుగా
""పెళ్ళంటే""
చరణం 2:
వరునికొరకు వధువు సంఘము
సిద్దపరచబడితే అందము
యేకదేహమ0టే అర్ధము క్రీస్తుతో సంఘము అనుబంధం
లోబడుటయే వధువుకు ఘనము
వరుని ప్రేమ వదువు స్వాస్త్యము
కలంకము ముడతలులేని పవిత్రమైన ప్రభువు శరీరము
తనకు తానుగా వధువు కోసమే
సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణప్రియుడు
మోసగించకా మాటదాటకా
వరుని అడుగు జాడలో నడిచే ప్రానేశ్వరి ఆ వదువు
గొప్పదైన ఆ...పెళ్ళి మ ర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యం...!.....ఛాయారూపము...!!
""పెళ్ళంటే"