Type Here to Get Search Results !

ఓ మానవుండా నీ గతి Song Lyrics | O manavunda nee gathi lyrics Song Lyrics - Telugu Gospel Song Lyrics

ఓ మానవుండా నీ గతి Song Lyrics | O manavunda nee gathi Song Lyrics - Telugu Gospel Song Lyrics

ఓ…మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా
ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ?

ఆహా…. ఆ…ఆ…అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే
మహా భయంకరమో – సింహంబుగా నుండు } 2

లోకాలు పుట్టి నప్పటి – నుండి మృతులైనా } 2
ఏ కులాజుడైన నాటికి – తీర్పులో నిలచును|| ఆహా…. ఆ… ||

మృతులైన ఘనులు హీనులు – యేసయ్య యెదుటను } 2
ప్రతివారు నిలచి యుందురు – బ్రతికిన రీతిగనే|| ఆహా…. ఆ… ||

గ్రంధాలు విప్ప బడగ – గ్రంధాలలో వారి } 2
గ్రంధంబు బట్టబయలై – పొందుదురు తీర్పును|| ఆహా…. ఆ… ||

నరులెల్ల క్రియల చొప్పున – మరి తీర్పు పొందుదురు } 2
మరణము మృతుల లోకము – గురియౌను అగ్నికి|| ఆహా…. ఆ… ||

ఈ నాడు నీవు కూడను – యేసుని విడచినచో } 2
ఆనాడు నీవు కూడను – అందుండి యేడ్చెదవు|| ఆహా…. ఆ… ||

దేవుని జీవ గ్రంధము – దేవుడు తెరచున } 2ు
ఎవ్వని పేరందుండదో – వాడగ్నిలో బడును|| ఆహా…. ఆ…||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area