నీ వైపే చూస్తున్నా Song Lyrics | Nee Vaiype Chusthunna Song Lyrics - Telug Christian Worship Song Lyrics
పల్లవి:
నీ వైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని
నీ ధ్యానం చేస్తున్నా నీవలనే మారాలని
నీ చిత్తము నా యెడల జరిగించాలని
నీ ప్రేమ నా యెడల ప్రవహించాలని
చరణం:1
వీచే గాలుల్లో నీ మాటలు విన్నానే
కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే
నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్యా
మోడైన నా జీవితము ఫలియించే నయ్యా
అనురాగం ఆనందం నాలోనే ఉండాలని
"నీ వైపే చూస్తున్నా"
చరణం:2
ఎవ్వరు లేనిది ఈ ఒంటరి జీవితం
ఎవరికి కానిది ఈ నా జీవితం - మరి
నాలోనా నీవుంటే నాకంతే చాలయ్య
నా బ్రతుకంతా నీతోనే నేనుంటా యేసయ్య
ఏ నాడూ విడిపోని నా బంధం నీవెనని
"నీవైపే చూస్తున్నా"
చరణం:3
అమ్మవు నీవని నే నిన్నే చేరితిని
మా నాన్నవు నీవని నీ ప్రేమను కొరితిని
నా అమ్మ నాన్నవు నీవే యేసయ్యా
ప్రతి క్షణము నన్ను చూసే కాపరి నీవయ్య
నా బ్రతుకూ నీతోనే తుదివరకు సాగాలని
"నీ వైపే చూస్తున్నా"