నాకు నీతోడుంటే Song Lyrics | Naku Nee Thodunte Song Lyrics - Telugu Christian Song Lyrics
నాకు నీతోడుంటే వర్ధిల్లిపోతాను
నీవు దూరమైతే నేనేమి చెయ్లేను
యేసయ్య నువు దీవించే దారివేరయ్యా
ఓసారి దీవిస్తే పదికాలాలేనయ్యా
1. డబ్బు దూరమైతే కష్టాలు పడతాను
ప్రేమ కరువైతే కన్నీరు చూస్తాను
నీవే లేకుంటే...
ముండ్లపొదలాంటి లోకంలో నడువలేనయ్యా
యేసయ్యా యేసయ్యా
2. ఎందరున్నాగానీ క్షణకాలమేనయ్యా
భూమిలోనిదంతా బహు వ్యర్థమేనయ్యా
నాతో నీవుంటే...
వంకరగా వున్న దారులన్నీ తిన్నగౌతాయి
యేసయ్యా యేసయ్యా
3. నీతివైద్యం చేసి నా కళ్ళు తెరిచావు
ప్రాణత్యాగం చేసి నీ ఆత్మనిచ్చావు
నీవే దూరమైతే...
అపవాదిలాగ నేను మారిపోతాను
యేసయ్యా యేసయ్యా