నా కన్నీళ్ళతో కడగాలయ్య Song Lyrics | Naa kanellatho kadagalayya Song Lyrics - Telugu Good Friday Song Lyrics

పల్లవి:- నా కన్నీళ్ళతో కడగాలయ్య
సిలువతో నడచిన నీ పాదములను
యేసయ్య ఎంత జాలి నీకయ్య నాపై
ఎంత ప్రేమ నీదయ్య...... "2"
"నా కన్నీళ్ళతో"
1. నా కోసమే గగనము విడచి
నా గమ్యము చూపించ దిగివచ్చినావు "2"
నా కోసమే ముళ్ళను భరియించి
నాపై నీ ప్రేమను కురిపించినావు "2"
"యేసయ్యా"
2.అవమానములు ఎన్నైనను
అతి ప్రియముగానే భరియించినావు "2"
మాట సాయమే చేయని మనుషులుండగా
నా కోసమే సిలువపై మరణించినావు "2"
"యేసయ్య"