మనసా ౼ ఓ మనసా Song Lyrics | Manasa O Manasa Song Lyrics - Telugu Christian Melody Song Lyrics
పల్లవి
మనసా ౼ ఓ మనసా
దిగులు పడకే ౼ మనసా
మనసార - శరణు వేడుమా
మదిలోన - క్రీస్తు ప్రభుని - నిలుపుమా...
ఆపత్కాలము నందు ఆదుకొను నాధుడు
ఆశ్రయించువారిని ఆదరించు దేవుడు
ఆశ్చర్యకరుడు ఆలోచన పరుడు
బలవంతుడైన - ప్రభు మనకుండగా
భయపడకుమా
// మనసా //
ప్రభుతో - జీవితమే
పరమార్థమని - ఎరిగి
ప్రభులో - జీవించు చుండగా
ప్రభు- సందేశమే - లోకానికి వెలుగని
ప్రభునే - ప్రకటించు చుండగా
సత్యము ఎరుగని - చీకటి శక్తులు
సత్య సువార్తను - అవరోధించగా
పావన మూర్తిని - పరిహాసించుచూ
పాతకులెందరో - దూషణ చేయుచూ
ద్వేషమే - శ్వాసగా - రగిలినా
బలవంతుడైన - ప్రభు - మనకుండగా
భయపడకుమా
// మనసా //
దేవుని ఆజ్ఞకు - లోబడి కొందరు
ఆయన మార్గమందు - నిలువగా
దేవుని పిలుపును - పొందిన కొందరు
ఆయన మాటలనే - పలుకగా
జీవము గలవాడు - మా దేవుడని తెలిపి
చావుకు ఎదురెళ్ళి - గెలిచేను కొందరు
బ్రతుకుట క్రీస్తే - చావైతే మేలని
హతసాక్షులుగా - మారేను కొందరు
మాదిరి - ఇంకెందరో - చూపగా
బలవంతుడైన - ప్రభు - మనకుండగా
భయపడకుమా
// మనసా //
శాశ్వత రాజ్యము - నిత్య నివాసము
ప్రభుతో వసియించు - భాగ్యము
శోధన సహితపు - నమ్మిక జీవితం
మరణం వరకు - పోరాటము
ఆద్యము నుండియు - భక్తులు యెందరో
అవనిలో జీవితం - క్షణ భంగురమని
పరదేశీయులమై - ఇల జీవించుచూ
పరలోకమే మన - చిరజీవంబని
ఓర్పుతో - నమ్మి - జీవించగా
బలవంతుడైన - ప్రభు - మనకుండగా
భయపడకుమా
// మనసా //