మహోన్నతుడా నీ కృపలో Song Lyrics | Mahonnathuda nee krupalo Song Lyrics - Hosanna Ministries Song Lyrics
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3
నా జీవిత ధన్యతై యున్నది -1
మోడుబారిన జీవితాలను
చిగురింప చేయగలవు నీవు - 2
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు - 2|| మహో ||
ఆకు వాడక ఆత్మఫలములు
ఆనందముతో ఫలియించనా - 2
జీవజలముల ఊటయైన
నీ యోరను నను నాటితివా - 2|| మహో ||
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచియుంచితివా -2
వాగ్దానా ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా - 2|| మహో||