కనుచూపు మేరలోన Song Lyrics | Kanuchoopu Meralona Song Lyrics - Christ Worship Songs Lyrics
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)
పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2)
స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)