ఎందుకో ఈ ఘోరపాపిని Song Lyrics | Endhuko Ee Ghora Papini Song Lyrics - Good Friday Song Lyrics
ఎందుకో ఈ ఘోరపాపిని
చేర దీశావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
అయినా నను ప్రేమించితివే ||2||
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు నన్ను విడిపించావు||2||
||ఎందుకో ఈ ఘోరపాపిని||
1. అన్యాయపు తీర్పు పొందావు నాకై
అపహాస్యం భరియించవా
ఆదరణ కరువై బాధింపబడియు
నీ నోరు తెరువ లేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది
||ఎందుకో ఈ ఘోరపాపిని||
2. ఉమ్మిరి నీదు మోముపైన
నా కోసం భరియించవా
గుచ్చిరి శిరమునే ముండ్లమకుటాని
నా కోసం ధరియించవా
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది
||ఎందుకో ఈ ఘోరపాపిని||