Type Here to Get Search Results !

ఎగురుచున్నది విజయ పతాకం Song Lyrics | Eguruchunnadi vijaya pathakam Song Lyrics - Hosanna Ministries Songs Lyrics

ఎగురుచున్నది విజయ పతాకం Song Lyrics | Eguruchunnadi vijaya pathakam Song Lyrics - Hosanna Ministries Songs Lyrics

Eguruchunnadi vijaya pathakam Song Lyrics

ఎగురుచున్నది విజయ పతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం
రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును - 2
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం

యేసునినామం ఉచ్చరింపగనే
సాతాను సైన్యము వణుకు చున్నది - 2
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే - 2

దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం - 2
పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం - 2

మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా - 2
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే - 2



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area