Yesayya Nee Krupalo Song Lyrics | యేసయ్య నీ కృపలో Song Lyrics - Jonah Samuel Song Lyrics

Singer | Sunaina |
యేసయ్య నీ కృపలో నేనుండుటే….. ధన్యము
నీవు నాకు తెలియుటే బహు శ్రేష్టము - నేను నిన్ను ఎరుగుటే నిత్యజీవము ||యేసయ్య నీ కృపలో||
నీవు నన్ను చేసిన విధము చూడగా
నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది
నా ముందు వెనుకగా నీవు ఆవరించగా
ఆ జ్ఞానమే నాకు అందకున్నది
నీ ఆత్మనుండి నేనెటు... వెళ్ళగలనయా....
నీ సన్నిధినుండి.. నేనెటు....... వెళ్ళగలనయా....
నీ చేతిలో నన్ను నీవు చెక్కియుండగా
నీ చేతిలో నన్ను నీవు చెక్కియుండగా.... ||యేసయ్య నీ కృపలో||
నీ తలపులు ఎంతో ప్రియమైనవీ..
వాటి మొత్తమూ ఎంతో గొప్పదైనది
లెక్కించెదనంటినా ఇసుకకంటెనూ...
లెక్కకూ ఎక్కువై అవి యున్నవి.
నీ ఆత్మనుండి నేనెటు... వెళ్ళగలనయా....
నీ సన్నిధినుండి.. నేనెటు...... వెళ్ళగలనయా....
నా దినములు నీ గ్రంథములో లిఖితమాయెగా
నా దినములు నీ గ్రంథములో లిఖితమాయెగా ....
యేసయ్య నీ కృపలో నేనుండుటే ధన్యము
నీవు నాకు తెలియుటే బహు శ్రేష్టము - నేను నిన్ను ఎరుగుటే నిత్యజీవము
యేసయ్య నీ కృపలో నేనుండుటే ధన్యము
నీవు నాకు తెలియుటే బహు శ్రేష్టము - నేను నిన్ను ఎరుగుటే నా జీవితగమ్యము.