Ekkadayya Nevu Lenidi Song Lyrics | ఎక్కడయ్యా నీవు లేనిది Song Lyrics - Anjana Sowmya Christian Songs Lyrics

Singer | Anjana Sowmya |
ఎక్కడయ్యా నీవు లేనిది
ఏమిటయ్యా నీవు చేయనిది
సర్వము నీవై సకలము నీవే తీర్చావు
ప్రాణమిచ్చి ప్రేమించావు యేసయ్యా
నీ ప్రేమను లెక్కింపదగునా నీ మేలును మరిచిపోగలనా
శత్రువులే మా వెనుక వెంటాడివేధించిన
సంద్రమంటి శ్రమలు ఎన్నో ఎదురైన
నీ ప్రేమతో నీ కరుణతో విడువక ఎడబాయక
ప్రేమించావు మము నడిపించావు ||నీ ప్రేమ||
సూర్యచంద్రులే క్షీణించి చీకటే కమ్మినా
ఎరికో గోడలాంటి బంధకాలే అడ్డొచ్చినా
నీ ప్రేమతో నీ కరుణతో నీ బలముతో కూల్చినావు
కాపాడావు కృపతో నింపావు||నీ ప్రేమ||
నా అన్నవారేఉన్నా నన్ను ఆదుకోపోయినా
ఎన్నెన్నో నిందలతో నన్ను నిట్టూర్చినా
నీ ప్రేమతో నీ కరుణతో నా అమ్మా నాన్నవై
లాలించావు నను ఓదార్చావు||నీ ప్రేమ||