Type Here to Get Search Results !

దేవా... నీ సన్నిధి నాకుండగా Song Lyrics | Deva Ne Sannidhi Nakundaga Song Lyrics - Telugu Worship Songs Lyrics

దేవా... నీ సన్నిధి నాకుండగా Song Lyrics | Deva Ne Sannidhi Nakundaga Song Lyrics - Telugu Worship Songs Lyrics

Singer Sireesha

దేవా... నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా... 2
ఆశ్రయమైనావు... ఆరాధించగా...
ఆదుకుంటావు ఆపద కంటే ముందుగ... 2
దేవా... నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా
నా దేవా నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా

అంధకారంలో అలసిన నా బ్రతుకును
ఆదరిస్తావు ఇమ్మానుయేలుగ
కనిపించని దారిలో నా శోధన కొలిమిలో
నా పాదములకు నీవు దీపమైనావుగా... 2
నా దు:ఖ దినములన్ని
సమాప్తమగునని చెప్పి
సంతోషమిస్తావు... చాలిన ప్రియుడవు
నా దీన ప్రార్ధనకు సమాధానమిచ్చి
నెమ్మదినిస్తావు... నజరేయుడవు... 2

నా బలహీనతలో నా వ్యాధి వేదనలో
నీ బలమునిస్తావు పరమ వైద్యుడువు నీవు
నే కృంగిన వేళలో ఏ ఆశ లేనప్పుడు
సమస్తమును నాకై సమకూర్చి చేస్తావు... 2
అగ్ని మేఘ స్తంభమై రేయిపగలు నను కాచే
ఆరాధ్య దైవమా... ఆరాధించెదను
నే బ్రతుకు దినములన్ని కృపా క్షేమమునిచ్చే
నా మంచి నేస్తమా.. నే పాడి పొగడెదను...2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area