ILALONA EDIAYINA Song Lyrics |ఇలలోన ఏదైనా Song Lyrics - Bro. Ravindra Vottepu Songs Lyrics
Singer | Bro. Ravindra |
ఇలలోన ఏదైనా వేరు చేయగలదా
నీ ప్రేమ నుండి యేసయ్యా ----2
ఓ....నా మార్గము నీవే...
ఓ...నా జీవము నీవే...2
కాలాలు మారినా- అపజయము ఎదురైనా
నా విజయము నీవే యేసయ్యా...2
......నా మార్గము.....
1. తల్లియైన మరచునేమో నే మరువనంటివి
ఏ తెగులు రాకుండా కాపాడుచుంటివి ...2
ఆదరణ కర్తవై అనుదినం....
నడిపించితివి నన్ను అనుక్షణం..
నీవే నా తండ్రివై- నీవే నా తల్లివై
శాశ్వత ప్రేమను చూపినావ్ యేసయ్యా...
..... ఇలలోన ....
2. రక్షించుకుంటివి నీ ప్రాణాలనర్పించి
పరిశుద్ద పరచితివి రక్తమును చిందించి..2
నా వేదన బాదలలో....
విరిగిన నా బ్రతుకును...
నా స్నేహితుడవై- నా ప్రేమికుడవై
తోడుగా నీడగా నిలచినావ్ యేసయ్యా....