Yesu neetho sahavasam Song Lyrics | యేసు నీతో సహవాసం Song Lyrics - Sis. Vineela Song Lyrics

Singer | Sis. Vineela |
యేసు నీతో సహవాసం, నాలోన పెంచింది ఆత్మ బలం |2|
నీలో ఎదిగేందుకు నీలా మారేందుకు, నిన్ను చూచేందుకు నిన్ను చాటేందుకు |2|
||యేసు నీతో సహవాసం||
నిశ్చలమైన మనసిచ్చేది, శోధన జయించు బలమిచ్చేదీ |2|
ఉన్నత స్థలముల పైన నిలిపి, నాకు విలువను సమకూర్చేదీ |2|
జయ జీవితమును రుచి చూపించి, విజయము(మోక్షము) పైన కాంక్ష పెంచేది
||యేసు నీతో సహవాసం||
పరులను ప్రేమించు గుణమిచ్చేదీ, ప్రకృతిపై అధికారమిచ్చేదీ , |2|
కుటుంబ కలతలను అంతము చేసి, గృహమును స్వర్గముగా చేసేదీ |2|
సుస్థిరమైన శాంతిని కూర్చి, సిలువ బాటలో నడిపించేది
||యేసు నీతో సహవాసం||