Madhuram Madhuram madhurame Song Lyrics | మధురం మధురం మధురమే Song Lyrics - Sis. Vineela Song Lyrics
Singer | Sis. Vineela |
పల్లవి:
మధురం మధురం మధురమే శ్రీ యేసుని నామ స్మరణం
మధురాతి మధురం మధురమే ప్రభు యేసుని వాక్య ధ్యానం (2)
నాదు బ్రతుకునే దర్శించి చేదు జీవితం చేదించి
మధుర మకరందమందించి మదిలో సిరులే కురిపించి (2)
మహిమాత్మతో నను వెలిగించిన యేసుని నామం యేసుని వాక్యం (2)
॥ మధురం ॥
చరణం:1- సర్వ జ్ఞాని ప్రభు యేసే - సర్వ వ్యాపి శ్రీ యేసే
సర్వ శక్తి సంపన్నుడు యేసే సర్వోన్నతుడు యేసే (2)
మా మదినే గుడిగా మలచీ.. మా గుండెల్లో కొలువుండి.. (2)
వెతలను బాపి స్థితులను మార్చిన స్తుతులకు పాత్రుడు యేసే (2)
॥ మధురం ॥
2. ఆత్మరూపి ప్రభు యేసే వాగ్రూపి శ్రీ యేసే
అంతరంగమున ఆత్మదీపమును వెలిగించినది యేసే (2)
అక్షయమైన జీవాహారముతో.. అంతకంతకు మహిమను నింపుతూ (2)
అంతము వరకు ఎంతో ప్రేమను వింతగా చోపును యేసయ్యా (2)
॥ మధురం ॥