Type Here to Get Search Results !

Naa Gitaradhanalo Yesayya Song Lyrics | నా గీతారాధనలో Song Lyrics | Na geetharadhanalo Song Lyrics

Naa Gitaradhanalo Yesayya Song Lyrics | నా గీతారాధనలో Song Lyrics | Na geetharadhanalo Song Lyrics

Singer Bro. Yesanna Garu

నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) ||నా గీతా||

నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2)
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే (2) ||నా గీతా||

చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2)
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) ||నా గీతా||

ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై (2) ||నా గీతా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area