Type Here to Get Search Results !

Megha Radhamu Paina song lyrics | మేఘ రధము పైనా Song Lyrics - Priya Himesh Christian Song Lyrics

Megha Radhamu Paina song lyrics | మేఘ రధము పైనా Song Lyrics - Priya Himesh Christian Song Lyrics

Singer Priya Himesh

మేఘ రధము పైనా – మహోన్నతము నుండి
మేఘ రాధముపైనా - మహోన్నతము నుండి
తరలివచ్చె క్రీస్తే – అప్ప రూప ధరుడై

సదా సదయుడు – సుధా హృదయుడు
ఆత్మ రూప చరుడు ||మేఘ రధము ||

మండుచున్న పొదలో – అగ్ని జ్వాల ఇతడే
దివ్య మందసములో – వాక్యరూపమితడే
తేనె రుచుల మన్నా – స్వర్గభోజ్యమితడే
సిరులు పొంగుచున్న – రాజ్యమిచ్చెనితడే || సదా సదయుడు ||

దోషములను బాపే – గొర్రెపిల్ల ఇతడే
రొట్టె విందు పంచే – రక్తమాంసమితడే
ఆత్మ హితము కూర్చే – అమృతము ఇతడే
అమరజీవమిచ్చే – మోక్షమిచ్చునితడే || సదా సదయుడు ||

తిమిర జీవితాన – వెలుగు రేఖ ఇతడే
మరణ భయములోన – అభయ రక్ష ఇతడే
ఆత్మ సంగమించే – అప్పరసము ఇతడే
నిత్యజీవితంలో – సత్యనేస్తమితడే || సదా సదయుడు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area