Madhuramainadhi siluva dhari Song Lyrics | మధురమైనది ఈ సిలువదారి Song Lyrics - Emmanuel Ministreis Song Lyrics

Singer | Dinesh |
పల్లవి : మధురమైనది ఈ సిలువదారి
విలువైనది ఈ ప్రేమదారి (2)
రక్షించెను ఈ కలువరిదారి
నడిపించెను పరలోకపుదారి (2) " మధురమైనాది "
1 : నిత్యజీవమిచ్చుటకు మోయలేని మ్రానును మోసావు నాకై,
మరువలేని త్యాగం చేసావు
మరణ ఛాయలనుండి విడిపించుటకు (2)
నీ రక్షణానందం కలుగచేయుటకు
వ్రేలాడిన పాపరహితుడా (2)
యేసయ్యా ..ఇసుమంతైనా చూపలేదు నీ పైనా
యేసయ్యా .. సోమసిల్లిపోయావా నాకోసమే (2)
"మధురమైనది"
2 : పరిశుద్ధతనిచ్చుటకు అమూల్యమైన రక్తమును కార్చవు నాకై,
ఆఖరి శ్వాసను విడిచావు,
అంధకారమునుండి విడిపించుటకు (2)
నిష్కళంకునిగా నన్ను మార్చుటకు
వ్రేలాడినా పుణ్య చరితుడా (2)
యేసయ్యా .. ఇసుమంతైనా చూపలేదు నీ పైనా
యేసయ్యా .. తల్లడిల్లిపోయావా నాకోసమే (2)
" మధురమైనది"
3 : నీవలే మార్చుటకు నీ సుందర సొగసును కోల్పోతివి నాకై మృతుడై లేచావు,
జ్యేష్ఠుల సంఘములో నేనుండుటకు (2)
నీ గాయాలలోనే ఆరోగ్యమిచుటకు
వ్రేలాడిన ముగ్ధమనోహరుడా (2)
యేసయ్యా.. ఇసుమంతైనా చూపలేదు నీపైన
యేసయ్యా.. దుషింపబడినావా నాకోసమే (2)
" మధురమైనది"