Type Here to Get Search Results !

Madhuramaina Nee Premanu Song Lyrics | మధురమైన నీ ప్రేమను Song Lyrics - Telugu Worship Song Lyrics

Madhuramaina Nee Premanu Song Lyrics | మధురమైన నీ ప్రేమను Song Lyrics - Telugu Worship Song Lyrics

Singer Sis. Sheebha

మధురమైన నీ ప్రేమను మరువలేను యేసయ్య
నీకు దూరమైననన్ను చేరదీసినావయ్యా
అడ్డుపడిన సాగరాన్ని చెదరగొట్టి నడిపినట్టుగా
నాజీవిత పాపాన్ని చెదరగొట్టినావయ్యా - 2
నా హృదయ దీపికవు నీవే యేసయ్య
నా ఆత్మ త్రాయకుడవు నీవేనయ్యా
ఎంతో దయాంతరంగుడవు యేసయ్య
ఎంతో త్యాగధనుడవు నీవేనయ్యా || మధురమైన నీ ప్రేమను ||

మరణచ్చాయ లోయలలో తిరుగుచున్న నన్ను
నీదు జీవ మార్గములో నడిపించుచున్నావయ్యా
ఇహలోక ఆశలతో నిండియున్న నన్ను
పరలోక ఊహలతో నన్ను నింపుచున్నావయ్యా
నా కీర్తనీయుడవు నీవే యేసయ్య
నా హృదయ నావికుడవు నీవేనయ్యా - 2
ఎంతో విశ్వసనీయుడవు యేసయ్య
ఎంతో దీనదయాళుడవు నీవేనయ్యా || మధురమైన నీ ప్రేమను ||

పాపులలో ప్రదమునిగా బ్రతుకుచున్న నన్ను
నీ సేవ చేయువానిగా నను మార్చినావయ్యా
హృదయాంధకారముతో నిండియున్ననన్ను
యేసు నీ సాక్షిగా నిలువబెట్టినావయ్యా - 2
నీవే సార్వభౌముడవు యేసయ్యా
నా హృదయవిభుడవు నీవేనయ్యా
ఎంతో సహనశీలుడవు యేసయ్యా
ఎంతో కృపామయుడవు నీవేనయ్యా || మధురమైన నీ ప్రేమను ||

క్షణభంగుర జీవితాన్ని నమ్ముచున్న నన్ను
అక్షయ ఆయువునియ్య ననుపిలిచినావయ్యా
మంటి దేహమును నమ్మి మురిసిపోయేనన్ను
మహిమ దేహ రూపముకై బ్రతికించుచున్నావయ్యా - 2
నా హృదయ నాధుడవు నీవే యేసయ్యా
నా హృదయ నాయకుడవు నీవేనయ్యా
ఎంతో మహాబలుడవు యేసయ్యా
ఎంతో మహనీయుడవు నీవేనయ్యా || మధురమైన నీ ప్రేమను ||




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area