Kalushatmudaina Papini Song Lyrics | కలుషాత్ముడైన పాపిని Song Lyrics - Dr. Ezra sasthri Songs Lyrics
Singer | Dr. Ezra sasthri |
కలుషాత్ముడైన పాపిని
పిలిచేవా యేసువా
పలుమారు బాధపరచినా
పిలిచేవు మానక (2)
కలుషాత్ముడైన పాపిని..
1.
నీ మెల్లనైన స్వరముతో
దినమెల్ల పిలుతువు (2)
నే నొల్లకుంటి వీనుల
నీ మెల్లని స్వరం (3)
||కలుషాత్ముడైన||
2.
ఐనను నా దేవా యేసువా
కనుపాప మాదిరి (2)
కానని విధమున చూతువు
అనుదినము కాయను
అనుఘడియ కాయను
అనుక్షణము కాయను
||కలుషాత్ముడైన||