Jeevithanthamu varaku neeke Song Lyrics | జీవితాంతము వరకు నీకే Song Lyrics - Andhra Kraistava Keerthanalu Songs Lyrics
Singer | Sis. Jessy |
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని - 2
నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం||
ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన - 2
అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం||
అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె - 2
తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను - 2
శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం||
నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ - 2
చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం||
మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే - 2
ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం||
పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక - 2
ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితా