Heenamaina Brathuku Nadi Song Lyrics | హీనమైన బ్రతుకునాది Song Lyrics - Sunitha Christian Song Lyrics

Singer | Sunitha |
ll ప ll హీనమైన బ్రతుకునాది ఘోరపాపిని ll2ll
దాపు చేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో....లేరు ఎవ్వరు... నాయనువారు
ll హీనమైన ll
1. మనిషికి మమత ఉన్నందుకా గుండెకోత
మదిలో నిన్ను నింపుకునందుకా విధిరాత ll2ll
కరుణించి నన్ను కష్టాలబాపు ll2ll
కరుణమయ....క్రీస్తేసువా ll హీనమైన ll
2. తల్లి తండ్రి కన్నమిన్న నీ మధుర ప్రేమ
భార్య భర్తల కన్నమిన్న మారని నీ ప్రేమ ll2ll
పాపికొరకు ప్రాణమర్పించిన ll2ll
త్యాగశీలివి...నీకే స్తోత్రము
ll హీనమైన ll
3. నిన్న నేడు రేపు యేసు మారనే మారవు
లోకులంతా మారిపోయిన స్థిరమైన వాడవు ll2ll
వెరువను జడియను ll2ll
నీకంటిపాపను...ననుకాచే దైవము
ll హీనమైన ll