Yevaru Sameepinchaleni Song Lyrics | ఎవరు సమీపించలేని తేజస్సులో Song Lyrics - Bro. Yesanna Garu Song Lyrics
Singer | Bro. Yesanna Garu |
ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే
ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో
ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ
ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో
పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ
ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో
జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభవేళ
ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో