PADEDHA STUTI GANAMU Song Lyrics | పాడెద స్తుతి గానము Song Lyrics - Hosanna Lyrics

Singer | Sis. Joy Sharon |
పల్లవి: పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము "2"
నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్టుడా నా యేసయ్య "2"
" పాడెద "
1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు "2"
నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను "2"
నీ అనుబంధము నాకు ఆనందమే "2"
" పాడెద "
2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే
నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే"2" నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను "2"
నీ అభిషేకము పరమానందమే "2"
"పాడెద"
3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే
నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి "2"
యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే "2"
నీ పరిచర్యలో మహిమానందమే "2"
" పాడెద "