Yesu Raju Puttinadule Song Lyrics | యేసు రాజు పుట్టినాడులే Song Lyrics | Urantha Chateddhamaa Song Lyrics
Singer | Appia |
యేసు రాజు పుట్టినాడులే హల్లెలూయ పాడేద్దామా -
రక్షకుడు పుట్టినాడులే ఊరంతా చాటేద్దామా ||2||
ఆకాశమందు దూతలవలే మహిమోన్నతుని స్తుతియించెదం -
మహిమను విడచి ఉదయించిన యేసు రాజుని స్వాగతించెదం ||2||
పొంగిపొర్లుచున్నది సంతోషం - గంతులు వేయుచున్నది నా హృదయం ||2||
1. దేవుని ప్రేమకు దూరమయ్యి లోకమంతా శాపమవ్వగా -
కరుణను విడచి కర్కశమైన హృదయముతో ఈ లోకముండగా ||2||
నీ ప్రేమను పంచుటకు ఇల వచ్చావా - కరుణించి మమ్మును క్షమియించావా ||2||
పొంగిపొర్లు చిన్నది సంతోషం - గంతులు వేయుచున్నది నా హృదయం ||2||
Happy happy Christmas merry merry Christmas ||2||
2. దేవుడవయ్యి దీనునిగానే పశువులపాకలో పవళించినావా -
నా నేరమునే భరియించుటకు సిలువను నీవు కోరుకున్నావా ||2||
నీ జీవమునిచ్చుటకు ఇల వచ్చావా - నీరక్తము కార్చి మమ్ము రక్షించావా ||2||
పొంగిపొర్లుచున్నది సంతోషం - గంతులు వేయుచున్నది నా హృదయం ||2|| ||యేసు రాజు||