Mattilona Muthyamalle Puttaduro Song Lyrics | మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో Song Lyrics - Christmas Songs Lyrics
Singer | Javed |
మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో
సందెపొద్దు సూరీడల్లే వచ్చాడురో
నింగినేలంతా ఆడి పాడంగా
సంబరాలతో సందడాయెగా
1. బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో దీనుడై పుట్టినాడురా .. సుఖమే కోరలేదురా
ఆ చలిరాత్రిలో చీకటంటి బ్రతుకులో దీపమై వచ్చినాడురా .. భేదమే చూపలేదురా
ఎంతో వింత కాదా దారి చూపే దివ్య తార
పాడే దూతలంతా కదిలొచ్చే గొల్లలంతా
అంబరాన్నంటే సంబరాలతో సందడే ఇల
2. వెన్నెలంటి వీధిలో చల్లనైన చూపుతో స్నేహమై చేరినాడురా ..
ప్రేమనే పంచినాడురా
అంధకార లోయలో అంతు లేని బాటలో మనకై వెదకినాడురా ..
రక్షణే తెచ్చినాడురా
ఎంతో వింత కాదా మరి నిన్నే కోరలేదా
రావా యేసు చెంత మనసారా వేడుకోగా
అంబరాన్నంటే సంబరాలతో సందడాయెగా