Type Here to Get Search Results !

Yesayya Yesayya Ne Mata Chalayya Song Lyrics | యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా Song Lyrics - Christian Worship Song Lyrics

Yesayya Yesayya Ne Mata Chalayya Song Lyrics | యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా Song Lyrics - Christian Worship Song Lyrics

Singer Anveshitha

యేసయ్యా యేసయ్యా - నీ మాట చాలయ్యా (4)
బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది
రక్షణనిచ్చి ఆదరించేది (2)

అ.ప. నీ మాటే యేసయ్యా మము బ్రతికించేదయ్యా
నీ మాటే యేసయ్యా మా అక్కరలన్ని తీర్చేది (2) "యేసయ్యా "

1. నీ మాట చొప్పున వలలు వేయగా విస్తారమైన చేపలతో వలలు నిండెనయ్యా
నీ మాట చొప్పున చెట్టు దిగిన జెక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినదయ్యా (2)
అయిదు రొట్టెలు రెండు చేపలు అయిదు వేల మందికి పంచెను నీ మాటే యేసయ్యా (2) " నీ మాటే"

2. నీ మాట చొప్పున నమ్మి వెళ్లిన శతాధిపతి దాసుడు స్వస్థత పొందెనయ్యా
నీ మాట చొప్పున పాపము విడచిన సమరయ స్త్రీ జీవజలములు పొందుకున్నదయ్యా (2)
చనిపోయిన లాజరును సమాధిలోనుండి జీవముతో లేపినది నీ మాటే యేసయ్యా (2) " నీ మాటే"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.