Agani parugulo Song Lyrics | ఆగని పరుగులో Song Lyrics - Latest Christian Song Lyrics

Singer | Anveshitha |
ఆగని పరుగులో ఎండిన ఎడారులు
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపునా
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై
కరుణించే నీ చూపు, మన్నించే నా మనవి
అందించే నీ చేయి, నా స్నేహమై
1. లోకప్రేమే సదా - కలల కడలే కదా
తరంగమై కావుమా - తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం
సదా నీకే దాసోహం
యేసయా ... అర్పించెదా - నా జీవితం
2. ఎదుట నిలిచే నీవే - ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా - జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం
సదా నీపై నా భారం
యేసయా ... ప్రేమించెదా - కలకాలము