ఊహకు అందని ప్రేమ Song Lyrics | Uhaku Andani Prema Song Lyrics - Sis. Betty Sandesh Songs Lyrics
Singer | Sis. Betty Sandesh |
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ - 2
తరాలెన్ని మారిన యుగాలెన్ని గడిచిన - 2
జగాన మారనిది యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 2
1.మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూలకారణం
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం - 2
మనుషులు మారిన మమతలు మారిన
బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు - 2 ప్రేమ ప్రేమ
2. జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం 2
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడ లంచం
యేసు ప్రేమ శాశ్వతం జీవితానికే సార్ధకం 2 ప్రేమ ప్రేమ