నూతనపరచుము మమ్ములను Song Lyrics | Nuthanaparachumu Mammulanu Song Lyrics - Bro. Stevenson New Year Song Lyrics
Singer | Bro. Stevenson |
నూతనపరచుము మమ్ములను యేసయ్యా.
నీకార్యములు మాపట్ల జరిగించుమయ్యా //2//
దర్శనమును మరవకుందును
విశ్వాసమును హత్తుకొందును // నూతనపరచుము//
నీ యందు సంతోషించునట్లు మమ్ము బ్రతికించుము
గతవత్సరముల నష్టము నుండి కొలుకోజేయుము //2//
మా వైపునకు తిరుగుము కోపము చాలించుము //2//
నీ కృపను కనపరచుము రక్షణ దయచేయుము
రక్షణ దయచేయుము నీ రక్షణ దయచేయుము
దర్శనమును మరవకుందును
విశ్వాసమును హత్తుకొందును // నూతనపరచుము//
నాతో సంభాషించుటకు నీవిష్టపడువాడవు
ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పి నిమ్మలపరచెదవు //2//
నిన్ను గూర్చిన వార్తవిని భయపడుచుంటిని //2//
వాత్సల్యము చూపమని బ్రతిమాలుచుంటిని
బ్రతిమాలుచుంటిని నిను బ్రతిమాలుచుంటిని
దర్శనమును మరవకుందును
విశ్వాసమును హత్తుకొందును // నూతనపరచుము//