కృపగలదేవా దయగల రాజా Song Lyrics | Krupagala Deva Dayagala Raja Song Lyrics - Bro. Abraham Song Lyrics
Singer | Bro. Abraham |
కృపగలదేవా దయగల రాజా ॥2॥
చేరితి నిన్నే బహుఘన తేజా
నీ చరణములే నే కొరితిని -
నీ వరములనే నే వేడితిని
॥కృపగలదేవా॥
సర్వాధికారి నీవే దేవా -
నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి -
ఆలోచనలే నేరవేర్చితివి
అర్పి౦చెదను నా సర్వమును నీకే దేవా -
ఆరాధించి ఆనందించెద నీలో దేవా ॥2॥
॥కృపగలదేవా॥
1) త్రోవను చూపే తారవు నీవే -
గమ్యము చేర్చే సారధి నీవే ॥2॥
జీవనయాత్ర శుభప్రదమాయే -
నా ప్రతి ప్రార్థన పరిమళమాయే
నీ ఉదయ కా౦తిలో నను నడుపుము -
నా హృదిని నీ శా౦తితో ని౦పుము ॥2॥
॥కృపగలదేవా॥
2) కృప చూపి నన్ను అభిషేకి౦చి -
వాగ్దానములు నెరవేర్చినావే ॥2॥
బహు వి౦తగా నను ప్రేమించినావే -
బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంతా వివరింతును -
నీ దివ్య మహిమలను ప్రకటింతును ॥2॥
॥కృపగలదేవా॥
3) నా యేసురాజా వరుడైన దేవా -
మేఘాల మీద దిగి వచ్చు వేళా
ఆకాశవీధిలో కమనీయ కా౦తిలో -
ప్రియమైన స౦ఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో -
జీవి౦తు నీలోనే యుగయుగములు ॥2॥
॥కృపగలదేవా॥