దేవలోక మహిమనంతా Song Lyrics | DEVALOKA MAHIMANANTHA Song Lyrics - Bro. Stevenson Christmas Song Lyrics

Singer | Bro. Stevenson |
దేవలోక మహిమనంతా భువిపైకి తెచ్చాడు
దీనురాలి కడుపునుండి యేసు ఉదయించాడు (2)
మానుజాళి పై ప్రేమతో దేవదేవుడు
నరరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు
కలిగెను విడుదల సంతోషం క్రిస్మస్
వెలిగిన మనసుల సంబరం క్రిస్మస్ (దేవలోక)
1.చీకటిని దూరం చేసి దివ్యమైన కాంతిని చూపి
ఎప్పుడూ మన తోడై నడిపిస్తాడు (2)
కీడు ఏది రాకుండా – దీవెనలు పోకుండా (2)
కంటి పాపలా కాచి భద్రం చేసే ప్రాణప్రియుడు
కలిగెను విడుదల సంతోషం క్రిస్మస్
వెలిగిన మనసుల సంబరం క్రిస్మస్ (దేవలోక)
2.పాపితోటి స్నేహం చేసి పాపముల శిక్షను బాపి
ఎప్పుడూ మన మధ్యే నివసిస్తాడు (2)
లోటు చూడనీకుండా – ఆటకంకాలు లేకుండా (2)
అన్నింటిని సమకూర్చి సాయం చేసే ప్రాణప్రియుడు
కలిగెను విడుదల సంతోషం క్రిస్మస్
వెలిగిన మనసుల సంబరం క్రిస్మస్ (దేవలోక)
3.వేదనను మాయం చేసి గుండెలోని బాధను మాన్పి
ఎప్పుడూ మనతోనే పయనిస్తాడు (2)
శత్రుబారి పడకుండా – ఆశయాలు చెడకుండా (2)
చుట్టూ కేడెమై యుండి కార్యం చేసే ప్రాణప్రియుడు
కలిగెను విడుదల సంతోషం క్రిస్మస్
వెలిగిన మనసుల సంబరం క్రిస్మస్ (దేవలోక)