Type Here to Get Search Results !

బెత్లెహేములో యేసు పుట్టెను Song Lyrics | Betlehemulo yesu puttenu Song Lyrics - New Telugu Christmas Song Lyrics

బెత్లెహేములో యేసు పుట్టెను Song Lyrics | Betlehemulo yesu puttenu Song Lyrics - New Telugu Christmas Song Lyrics

Singer Bro. Sunil

బెత్లెహేములో యేసు పుట్టెను – ఆనవాలుగా ఒక తార వెలసెను (2)
ఇలలో ఆనందమే మనకు క్రిస్మస్ సంతోషమే
భువిలో సంబరమాయె మనకు దివిలో సంతసమాయే (బెత్లెహేములో)
చక్కనైన యేసు స్వామి బేత్లెహేము పురమునందు
పాపుల కొరకు నేడు పుట్టినాడంట
అంబరాన్ని తాకినట్లు సంబరాలు చేసేద్దాము
ఇంటిటా తిరిగి వార్త చెప్పేద్దామంట

1. దేవదూత వార్త చెప్పగా – గొల్లలంత చేరి వచ్చిరి
రక్షకుడు పుట్టినాడని – మనసారా పాట పాడిరి (2)
సర్వోన్నతమైన స్థలములలో దేవునికిష్టులైన మనుషులకు (2)
సమాధానమే ఓయ్ సమాధానమే – ఓయ్ సమాధానమే దొరికింది మనకు
సమాధానమే దొరికింది మనకు
ఇలలో ఆనందమే మనకు క్రిస్మస్ సంతోషమే
భువిలో సంబరమాయె మనకు దివిలో సంతసమాయే (బెత్లెహేములో)

2. ఆకాశాన తార చూడగా – జ్ఞానులకు వింత కలిగెను
తారవెంట పయనమాడిరి – యేసు చెంత మోకరిల్లిరి (2)
లోకరక్షకుడు పుట్టినాడని – ఆనందాలతో మురిసిపోయిరి (2)
పాట పాడి ఓయ్ పాట పాడి – ఓయ్ పాట పాడిరి కానుకలు ఇచ్చిరి
పాట పాడిరి కానుకలు ఇచ్చిరి
ఇలలో ఆనందమే మనకు క్రిస్మస్ సంతోషమే
భువిలో సంబరమాయె మనకు దివిలో సంతసమాయే (బెత్లెహేములో)Telugu Christian Songs Lyrics