Sarvayuganiki Kaarana Janmudu Song Lyrics | సర్వయుగానికి కారణ జన్ముడు Song Lyrics - Latest Christmas Song Lyrics
Singer | Haricharan |
సర్వయుగానికి కారణ జన్ముడు – సర్వ సృష్టికి కారణ భూతుడు (2)
సశరీరుడై ప్రత్యక్షమయ్యెను – సర్వాధిపతియైన దైవ తనయుడు (2)
ఇమ్మానుయేలుగా మనకై పుట్టెను – దేవుడే మనకు తోడని బయలుపరచెను (2)
సర్వ జనులకు సంబరము – సమాధానమే జగతికి సదాకాలము (2)
1.కాలమునే కలిగించినవాడు – కాలములో ప్రవేశించినాడు
నిత్యము మహిమలో నివసించువాడు – దీన శరీరము ధరియించినాడు (2)
కలుషము బాపను కరుణను చూపను – కరుణామయుడుగా దిగివచ్చినాడు (2)
సర్వ జనులకు సంబరము – సమాధానమే జగతికి సదాకాలము (2) (సర్వయుగానికి కారణ)
2.అన్నిటినీ కలిగించినవాడు – కడవరి కాలాన ఏతెంచినాడు
ఆది దేవుని స్వరూపియైనవాడు – మానవ రూపము దాల్చినాడు (2)
పాపము మాపను ప్రేమను చూపను – నిజరక్షకుడిగా ఇల వచ్చినాడు (2)
సర్వ జనులకు సంబరము – సమాధానమే జగతికి సదాకాలము (2) (సర్వయుగానికి కారణ)