Type Here to Get Search Results !

Sarvadhikarivi sarvagnudavu Song Lyrics | సర్వాధికారివి సర్వజ్ఞుడవు Song Lyrics - Yesanna Garu Song Lyrics

Sarvadhikarivi sarvagnudavu Song Lyrics | సర్వాధికారివి సర్వజ్ఞుడవు Song Lyrics - Yesanna Garu Song Lyrics

Singer Yesanna Garu

సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు - 2
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
మహిమాత్మతో నను నింపితివా - 2

అతీసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా - 2
ఎనలేనే నీ ఘనకార్యములు తలచి
స్తుతించుచు నిను నే మహిమపరతును - 2|| సర్వాధికారివి ||

బలశౌర్యములుగల నా యేసయ్యా
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
మారవే నీ సాహసకార్యములు యెన్నడు
ధైర్యముగా నిను వెంబడింతును - 2|| సర్వాధికారివి ||

సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక
భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా - 2
బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును - 2|| సర్వాధికారివి ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.