Raare Janulara Kristuni Song Lyrics | రారే జనులార క్రీస్తుని Song Lyrics - Neekai Janminche Lyrics
Singer | Neekai Janminche |
రారే జనులార క్రీస్తుని ప్రజలార నీకై జన్మించె శ్రీ యేసుడు
పాడెదము కొనియాడెదము , వేడెదము ఉల్లసించెదము (2)
1). బెత్లహేములో పశువుల పాకలో యూదుల రాజు జనులందరి రక్షకుడు (2)
విడువడు నిన్ను ఎడబాయడు ఏక్షణమైనా నిన్ను కాచే దేవుడు (2)
2) దారిని చూపె ఆ తారా జ్ఞానులకు పొందిరి పరిశుద్ధుని దర్శనము (2)
బంగారు సాంబ్రాణి బోళమును అర్పించిరీ బహుమతిగా ఆ నాడు (2)
3) రాజ్యాలనేలే రారాజై ఉండి నీ కొరకై పుట్టినాడు పశువుల పాకలో (2)
కోరేను నీ హృదిలో స్థానమును అనుదినము నీతోనే ఉండుటకు (2)
4) ప్రేమను చూపె దేవుడు మనకుండగా ధైర్యమునిచే తండ్రి మనకు తోడుగా (2)
జడియకూ నేనున్నాఅను వాడు అనుక్షణము నిన్ను బ్రోచెనాధుడు(2)