Type Here to Get Search Results !

Nee Sannidhilo Anandame Song Lyrics | నీ సన్నిధిలో ఆనందమే Song Lyrics - Telugu Worship Song Lyrics

Nee Sannidhilo Anandame Song Lyrics | నీ సన్నిధిలో ఆనందమే Song Lyrics - Telugu Worship Song Lyrics

Singer Haricharan

నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే

స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా

1. మా హృదయాలను నీ ఆలయముగా
నీ ఆలయమే మా దాగు చోటుగా

నీ చిత్తము మాలో నెరవేరగా
పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా

కృప చూపుము దేవా - దీవించు ప్రభువా
నీ ఆత్మ శక్తితో నింపుము దేవా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా

2. నీ మహిమార్థమే మా క్రియలన్నియు
నీ కనికరములే మేలులన్నియు

విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా
నీ వాక్య వెలుగులో దర్శించుమా

దరి చేర్చు ప్రభువా - పరలోక దేవా
కడ వరకు మమ్ము నడిపించుమా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area