Kaliseti Andaala Anubandhame Song Lyrics | కలిసేటి అందాల అనుబంధమే Song Lyrics - Telugu Christian Marriage Song Lyrics
Singer | Haricharan |
కలిసేటి అందాల అనుబంధమే
ఇది ఏనాటికైనా మహనీయమే
ఎన్నెన్నో కాలాల అనురాగమే
ఈనాడే ఇలలో శ్రీకారమే
కమనీయమైన కళ్యాణమే
1. ఇరువురూ ఏకమై జీవించాలీ
దేవునీ ప్రేమలో ఒదిగిపోవాలీ
కలిమిలో లేమిలో ప్రేమించాలీ
మమతలే మల్లెలై పరిమళించాలీ
మురిసిపోయే వేదిక
మరువలేని వేడుక
ఒకరికొకరు తోడుగా
ప్రభువు చేసే జంటగా
ప్రేమానురాగాల ఈ బంధమే - మంగళమేగా శుభప్రదమే
ఆనందమేగా - కళ్యాణమే
2. గుణములే సిరులుగా స్వీకరించాలీ
చెరగనీ స్నేహమై నిలిచిపోవాలీ
క్రీస్తులో పయనమే సాగించాలీ
వాక్యమే మనసులో పదిలమవ్వాలీ
ప్రభువు ద్రాక్షావల్లిగా
ఫలమునిచ్చే తీగలా
వరములెన్నో పొందగా
తరములెన్నో చూడగా
పరిశుద్ధ దేవుని నిర్ణయమే - వైభోగమేగా శుభకరమే
కమనీయమైన కళ్యాణమే