Nee Mandirame Maaku Aashrayam Song Lyrics | నీ మందిరమే మాకు ఆశ్రయం Song Lyrics - Calvary Temple Song Lyrics

Singer | Dr. Satish Kumar |
నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారము
నీ మాటలతో మమ్మునోదార్పుము నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము
నీవే కదా ఆధారము నీవే కదా ఆశ్రయం
యాకోబును దీవించినట్టుగా మమ్ము కూడా దీవించుమయా
యోసేపుకు తోడైయున్నట్టుగా మాకు కూడ తోడుండుమయా
మోషేను నడిపించినట్లుగా మమ్మును నడిపించుమయా
దావీదును హెచ్చించినట్లుగా మమ్మును హెచ్చించుమయా
శిష్యులతో మాట్లాడినట్లుగా మాతో కూడా మాట్లాడుమయా
పేతురును క్షమియించినట్లుగా మమ్ము కూడా క్షమియించుమయా
తోమాను సరిచేసినట్లుగా మమ్మును సరిచేయుమయా
పౌలును వాడుకొనినట్లుగా మమ్మును వాడుకొమ్మయా