Nannu Diddumu Song Lyrics | నన్ను దిద్దుము చిన్న ప్రాయము Song Lyrics - Old Christian Song Lyrics
Singer | Chinmayi |
నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను||
మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను||
చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను||
ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను||
వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||