Type Here to Get Search Results !

Naakintha Protsaha Song Lyrics | నా కింత ప్రోత్సాహా Song Lyrics - Bible Mission Song Lyrics | Devadasu Ayyagari Songs

Naakintha Protsaha Song Lyrics | నా కింత ప్రోత్సాహా Song Lyrics - Bible Mission Song Lyrics | Devadasu Ayyagari Songs

Singer Jeeva

నా కింత ప్రోత్సాహా - నందంబుల్ గల్గుట - కే కర్త ఘనమైన - హేతువై యుండు
నాకు గల యున్నత కతమ్మే - నాధుఁ డగును నేను మురియు - శ్రీకరంబగు నామ మేది - సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥

1.ఎవరు నా భక్తికి - హితమైనట్టి పునాది - యెవరు నా కంఠంబు - నెత్తెన్ పాటలతో
ఎవరు నా పాపముల - భారము నెత్తుకొని దేవునికి నాకును - చివరకున్ స్నేహంబు కలిపిరి - సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥

2.నేను నా విధు లెల్ల - నిశ్చయంబుగ నెఱుఁగ - జ్ఞాన మిచ్చుచునుండు జ్ఞాని యెవ్వారు
వాని యెడల నను యధార్థ - పరునిగాఁ గావించి యవినా - చే నెరవేర్పించు నెవరు - సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥

3.ఎవరు నా శత్రువు - నెదిరించి గెల్చిరి - యెవరు నా శోకంబు - నెగురం గొట్టిరి
ఎవరు నా హృదయంపు మూర్ఛను - నీడ్చి సేదను దీర్చి మనసు - చివుకు మను గాయంబు మాన్పిరి - సిల్వఁబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥

4.మరణంబులో నాకుఁ - జిర జీవ మెవ్వారు - మరణంబునకె గొప్ప మరణ మెవ్వారు
విరివిలేని మహిమ సేలు - దరిని నుండఁగ నన్నుఁ జెంతను - స్థిరముగ స్థాపించు నెవరు - సిల్వఁబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥

5.నన్ను రక్షింప మర ణం బొందియు సమాధి - నెన్నటికిని గెల్చి - యున్న ప్రభునందు
నున్న విశ్వాంసబె నాకు నుత్సవంబును గలుగ జేయును - చెన్నగు నా ప్రభు విఁ కెవ్వరు - సిల్వఁ బడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area