Type Here to Get Search Results !

Naa jeevitha baga swamivi Song Lyrics | నా జీవిత భాగస్వామివి Song Lyrics - Yesanna Garu Song Lyrics

Naa jeevitha baga swamivi Song Lyrics | నా జీవిత భాగస్వామివి Song Lyrics - Yesanna Garu Song Lyrics

Singer Yesanna Garu

నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు } 2
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా } 2

నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి } 2
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి } 2|| నా జీవిత ||

నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి } 2
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి } 2|| నా జీవిత ||

నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి } 2
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area