Krupalenno Kuripinche Song Lyrics | కృపలెన్నో కురిపించే సంవత్సరం Song Lyrics - Sis. Akshaya New Year Song Lyrics
Singer | Sis. Akshaya |
కృపలెన్నో కురిపించే సంవత్సరం
ఆనందం ఉప్పొంగే సంవత్సరం (2)
శాశ్వతమైన నీ ప్రేమను
యెనలేని నీదు వాత్సల్యము (2)
మా యెడల చూపే సంవత్సరం
మమ్ము చేరదీసే సంవత్సరం(2)
మా తోడు నిలిచే సంవత్సరం
మమ్ము నడిపించే సంవత్సరం ||కృప ||
నూతనక్రియను నూతనకార్యము
నూతనముగా చేసి
ఎడారిలో నదులు ప్రవహింపజేసి
అరణ్యములో త్రోవజేసి (2)
నీ ప్రజల పక్షమున ఈ కార్యమును చేసి
విజయమునిచ్చెడి సంవత్సరం (2)
ఈ మాట నెరవేర్చే సంవత్సరం
నీ వాగ్దానం నెరవేర్చే సంవత్సరం ||కృప ||
నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి
అవమానమును కొట్టివేసి
ఖ్యాతిని మంచిపేరును ఇచ్చి
ఆనందమును కలుగజేసి (2)
నీ ప్రజల పక్షమున ఈ కార్యమును చేసి
ఆశీర్వదించెడి సంవత్సరం (2)
నీ వాక్కు స్థిరపరిచే సంవత్సరం
నీ వాగ్దానం నెరవేర్చే సంవత్సరం ||కృప ||
అంత్యదినములలో మనుష్యులందరిపై ఆత్మను కుమ్మరించి
సూచకక్రియలు మహాత్కార్యములు
అద్భుతములను చేసి (2)
నీ ప్రజల పక్షమున ఈ కార్యమును చేసి
అభిషేకించెడి సంవత్సరం (2)
ప్రవచనము నెరవేర్చే సంవత్సరం
నీ వాగ్దానం నెరవేర్చే సంవత్సరం ||కృప ||