Daiva Kumarude Deenudaina vela Song Lyrics | దైవ కుమారుడే దీనుడైన వేళా Song Lyrics - Sis. Nissy Paul Christmas Song Lyrics

Singer | Sis. Nissy Paul |
దైవ కుమారుడే దీనుడైన వేళా
దిక్కులేని మనపై దయను చూపిన వేళా
సంబరమాయనే మది మురిసిపోయెనే - 2
ఆనందమే సంతోషమే హృదిలొ నిండెనె
ఇహ మందు పరమందు స్తుతి ఆరాధనే - 2
కారు చీకటి కమ్మిన ఈ భువిలోన
అద్భుతమైన దీపమై వెలుగు విరాజిమ్మెనుగా - 2
ఆ వెలుగే నిన్ను నన్ను ప్రకాశింపచేసెనుగా
మన అందరి జీవితాలలో సంతోషము నింపెనుగా - 2 || సంబరమాయనే ||
ప్రవచింపబడెను ముందుగానే రక్షకుడు పుట్టునని
లేఖనాలు నెరవేర్చు పుట్టనేసు మురిసెను ఈ ధరణి - 2
చెప్పినట్టుగానే ప్రతి మాటను నెరవేర్చెను నా బ్రతుకులో
ప్రతి పాపపు బంధకాలనుండి విడిపించే ఆ సిలువలో - 2 || సంబరమాయనే ||