Christmas Panduga Gundela Ninduga Song Lyrics | క్రిస్మస్ పండుగా గుండెల నిండుగా Song Lyrics - Christmas songs Lyrics
Singer | Sis. Rebeka |
క్రిస్మస్ పండుగా గుండెల నిండుగా -తెచ్చింది సంతోషమే పరమాత్ముడినే పసిబాలుడిగా - ఇచ్చింది బహుమానమే
ఈ లోకమునకు వెలుగుని తెచ్చి - ప్రతి పాపికి రక్షణనిచ్చి
ఇది క్రిస్మస్ పండుగా సంతోషమే - ఇది క్రిస్మస్ పండుగా ఆనందమే - 2
చరణము(1):
తూర్పు దిక్కునా చుక్కను చూచి - యూదులరాజు పుట్టాడనుచు
తూర్పు దేశపు జ్ఞానులు కలసి - రాజుల రాజున్ చూడవచ్చిరి
బంగారు సాంబ్రాణి బోళములు - కానుక తెచ్చిరి - సాగిలపడి పూజించి పరవశించిరి -
దావీదు పట్టణమే ధన్యమాయనే - లోకమంత మహిమతో నిండిపోయెనే
ఇది క్రిస్మస్ సంతోషమే - ఇది క్రిస్మస్ ఆనందమే - 2
చరణము(2):
అర్ధరాతిరి జాముయందునా - ఆశ్చర్యకరమైన వెలుగుకలిగినే
దూత వచ్చి గొల్లలకు తెలిపే బాలయేసుని జన్మవార్తను
కాపరులంత బెత్లహేము వెళ్లిరి - బాలయేసుని గాంచి ఆశ్చర్యపడిరి
దేవున్ని మహిమపరచి స్తోత్రించిరి - శుభవార్తను చాటి చెప్తు తిరిగి వెళ్లిరి
ఇది క్రిస్మస్ సంతోషమే - ఇది క్రిస్మస్ ఆనందమే - 2