Type Here to Get Search Results !

Avadhululeni Adbhuta Prema Song Lyrics | అవధులు లేని అద్భుత ప్రేమ Song Lyrics - Nissy John Song Lyrics

Avadhululeni Adbhuta Prema Song Lyrics | అవధులు లేని అద్భుత ప్రేమ Song Lyrics - Nissy John Song Lyrics

Singer Nissy John

అవధులు లేని అద్భుత ప్రేమ -
అర్హత లేని నాపై చూపి
ప్రతిష్ఠిత వస్త్రమును ధరింపజేసి -
నీ సన్నిధినిలిచే భాగ్యమునిచ్చి
నిను సేవించే ధన్యతనిచ్చి-
ఇన్నాళ్లు తోడై నను నడిపించిన
అద్వితీయ దేవా నీకే స్తోత్రము...

అను పల్లవి :
స్తోత్రము స్తోత్రము స్తోత్రార్హుడా
నాలాంటి నీచులను ప్రేమించిన యేసయ్య!
కృతజ్ఞత హృదయముతో ఘన స్తోత్రము
కరుణించి క్షమియించే కృపాసాగరా!

1. నీ రాజ్యస్థాపనకై నన్ను పిలిచి -
కృపావరములను అనుగ్రహించి
బలహీనుడనైన నను బలపరచి -
బలమైన ఆత్మతో అభిషేకించి
నీ ఘన సేవయే... చేసే కృపనిచ్చినావే....
ఎబినేజరువై సహాయము చేసినావే...

2. నీ పొలములో పనివానిగా -
నీ దాసులతో జతపనివానిగా
ఆత్మల సంపాదనే ధ్యేయముగా -
నీ సంఘమును కాయువానిగా
నీపాద సేవయే... చేసే కృపనిచ్చినావే....
ఇమ్మానుయేలువై మాకు తోడుండినావే...


3. గుండెకు గాయములు - అవమాన శోధనలు
నా పైకెగసి కృంగజేసినను...
నా సహాయమై ఆశ్రయదుర్గమై -
విశ్వాస్యతను నాపై కనుపరచి
నీ దివ్య సేవయే... చేసే కృపనిచ్చినావే....
యెహోవా నిస్సివై విజయము నిచ్చినావే



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area