Anukshanam Ne Krupalo Song Lyrics | అనుక్షణం నీ కృపలో Song Lyrics - Telugu Christian New Year Song Lyrics

Singer | Sis. Sheebha |
అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో
నా జీవితం దాచినావు ''2''
విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య
ఎడబాయదు నీ అనురాగము ''2''
శాశ్వత జీవము నను చేర్చుటకు
ఉన్నత మహిమ విడచితివి ''2''
నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు ''2''
దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య
సాగిలపడి నిను సేవించెద ''2''
నా శోధనలో కలవరపడుచు
వేదనతో నిండే నా హృదయం''2''
నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది ''2''
ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య
నను విడిపించి దీవించువాడవు ''2''